అక్రమంగా తరలిస్తున్న 363 లీటర్ల గడ్డి మందును వాంకిడి పోలీసులు పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..శనివారం వాంకిడి RTA చెక్ పోస్ట్ వద్ద రాత్రి వాహనాలు తనిఖీలు చేపట్టారు. రాజుర వైపు నుంచి వాంకిడి వైపు వస్తున్న కారును తనిఖీ చేయగా అందులో 363 లీటర్ల గడ్డి మందు లభించింది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.