గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ డీసీపీ లా &అర్డర్ ప్రసాద్ రావు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం, బందోబస్తులో పోలీస్ విధివిధానాలపై అవగాహన కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని వాసవి ఫంక్షన్ హల్లో నిర్వహించారు.