కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థినిల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ కోరారు. మైలవరం మండల విద్యా శాఖ అధికారులు చిట్టి బాబు,శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులు తప్పు చేస్తే మందలించాలి తప్ప అసభ్యకరంగా విద్యార్థినులను అకారణంగా చిన్న చిన్న తప్పులకు అసభ్య పదజాలంతో తిడుతున్నారని ఆరోపించారు.