యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో వృద్దులు వితంతువులు వికలాంగులు సోమవారం రాస్తారోకోను నిర్వహించారు ఈ సందర్భంగా సమయానికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమయానికి పెన్షన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పోస్ట్మాన్ సమయానికి రాకపోవడం వల్ల నిరీక్షణ చేస్తున్నామని, రెండు నెలల పెన్షన్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన రావాల్సిన పెన్షన్ వచ్చేనెల 1వ తేదీకి వస్తున్నాయని ఈ నెల రోజుల్లో పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సమయం కూడా తెలియని పరిస్థితి దాపరించి ఉందన్నారు.