గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకుని ఆరుగురు కూలీలు ట్రాక్టర్లు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోపాలపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.