దేవరకద్ర మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష ఫలితాలలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఊర్మిళ బుధవారం తెలిపారు.ఈ పరీక్ష ఫలితాలలో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 30 మంది విద్యార్థులకు 18 మంది ఉత్తీర్ణులయ్యారు.బైపీసీలో 66 మంది విద్యార్థులకు 35 మంది, సీఈసీలో 62 మంది విద్యార్థులకు 45 మంది, హెచ్‌ఈసీలో 37 మంది విద్యార్థులకు 19 ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు.195 మంది విద్యార్థులకు 117 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆమె తెలిపారు.