ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్కకు మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, సరిపడా యూరియా ఇప్పించాలని మంత్రిని మహిళలు నేడు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. ఎన్ని రోజులు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.