జీవీఎంసీ 55వ వార్డు ధర్మానగర్, జోగారావు నగర్ ప్రాంతాలకు సంబంధించి సుమారు 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు, స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరె, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ పీలా మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా జీవీఎంసీ నిధులతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు, సుందరీకరణ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు విశాఖ నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.