ఒరిస్సా పోర్టు నుంచి 2600 మెట్రిక్ టన్నుల యూరియా నంద్యాల జిల్లాకు బయలుదేరిందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 3న బుధవారం సాయంత్రానికి యూరియా జిల్లాకు చేరే అవకాశం ఉందన్నారు. జిల్లాలో యూరియా గురించి రైతులు ఎవ్వరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.యూరియా వినియోగాన్ని కూడా అవసరం మేరకే రైతులు వినియోగించాలని కలెక్టర్ కోరారు.