కడప వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఇద్దరికీ తీవ్రగాలైన సంఘటన శనివారం మూడు గంటల పది నిమిషాల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. వివరాల మేరకు నేత్రన్ 18 సం. హరి 18 సం. చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ వెనక వీరభద్ర వీధికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు