అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్నంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నుండి పట్టణంలో వివిధ ప్రాంతాల వద్ద ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను నిమజ్జన ఉత్సవాలకు భారీ ఏర్పాట్ల ద్వారా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో నిమజ్జనోత్సవాల నిర్వహించే వినాయక ఉత్సవాల నిర్వాహకులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా రాత్రి 10 గంటల లోపు నిమర్జనం ఉత్సవాలు ముగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. పట్టణంలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జంసా నృత్యాల ద్వారా నిమర్జనం నిర్వహించారు.