తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లును అడిషనల్ ఎస్పీ రవిమనోహర ఆచారి పరిశీలించారు. వెంకటగిరికి విచ్చేసి అమ్మవారిగుడి వద్ద, కుమ్మరి వీధిలోని పుట్టిన ఇల్లు, జీనిగల వారి వీధిలోని మెట్టినింటినీ, రాజా వారి వంటగది పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 10, 11వ తేదీల్లో జరగబోయే జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు