సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను, అతని తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తాను ఖండిస్తున్నానని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు లోని ఆయన నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఒక నటుడి కుటుంబాన్ని అంత దారుణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్టడం సమంజసం కాదని అన్నారు. లోకేష్ పై ఉన్న స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికే జూనియర్ ఎన్టీఆర్ ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తిట్టాడంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు విమర్శిం