*పత్రికా ప్రకటన,* కాకినాడ, సెప్టెంబర్ 02, 2025. ఈ నెల 5న గణపతి విగ్రహాల నిమజ్జనాలు, మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.. ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, డీఆర్వో వెంకటరావు ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస రావులతో కలిసి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో జిల్లాస్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మత్స్య, అగ్నిమాపక శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో వినయాక విగ్రహాల నిమజ్జనం,