పెడన మండలంలో యూరియా పంపిణీ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు సొసైటీల వద్ద బారులు తీరారు. ఆధార్ కార్డులతో వచ్చిన రైతుల వల్ల ఆయా ప్రాంతాల్లో రద్దీ పెరిగింది. రైతుల క్రమబద్ధత కోసం అధికారులు టోకెన్ల ప్రక్రియను చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో టోకెన్లను అందజేస్తున్నారు.