రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను, మండల పరిషత్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మామిడికుదురు మండలానికి చెందిన ఎంపీటీసీలు గురువారం ఆందోళన చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం పి.గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవ వేతనం పెంపు హామీని అమలు చేయాలని వారు కోరారు.