నల్లవాగు ప్రాజెక్టు నీటిని ఖానాపూర్ టిఆర్ఎస్ నేత స్వార్థానికి వాడుకున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఉదయం 10 గంటలకు నారాయణఖేడ్ నియోజకవర్గం నల్లవాగు ప్రాజెక్టు వద్ద కుడి ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నల్లబాగు ప్రాజెక్టు రూపొందించడం జరిగిందని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసిందన్నారు. ప్రతిపక్షాలు బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.