అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతల వీధి వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం పెదబయలు నుండి పాడేరు వస్తున్న బైకిస్ట్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడని అయితే మృతి చెందిన వ్యక్తి పాడేరులో సుండ్రు పుట్టు వద్ద నివాసం ఉంటున్న జవ్వాది మత్స్యలింగం గా గుర్తించారు అని తెలియజేశారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.