ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్రను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి గాంధీ చౌక్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించాలని, 9 రోజుల పాటు భక్తితో నవరాత్రి ఉత్సవాలను చేశామని అన్నారు.