రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని బిజెపి కడెం మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కడెం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మండల నాయకులతో కలిసి నిరసన తెలిపి తాసిల్దార్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని సమర్పించి వారు మాట్లాడారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్లు, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు తదితర అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.