స్టీల్ ప్లాంట్లో భారీ దొంగతనం బయటపడింది. అత్యంత భద్రతా సామర్థ్యం ఉన్నచోట ఈ దొంగతనం జరగడం ఉక్కు ఉద్యోగుల్లో కలకలం రేపింది. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ అందించిన వివరాలు ప్రకారం గత నెల 28న బ్లాస్ట్ ఫర్నస్ డిపార్ట్మెంట్లో కొన్ని స్క్రాప్ కులింగ్ కాపర్ ఐటమ్స్ ఉండడం అవి దొంగలించబడ్డాయని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలియజేసిందని దీని విలువ 25 లక్షల దాకా ఉంటుందని అంచనా వేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కొందరు అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగిందని త్వరలోనే అసలు నిందితులను పట్టుకుంటామని ఆయన తెలియజేశారు.