ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా మారింది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి బురదగా మారింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నది ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలియజేసినట్లు డిపో మేనేజర్ నరసింహులు తెలిపారు. దీంతో ఉన్నత అధికారుల నుండి ఆదేశాలు రావాలని ఆయన పేర్కొన్నారు. వారి ఆదేశాలు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.