ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ప్రైవేటు వాళ్లకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలని ముందుగా మూడు ముక్కలుగా విభజించాలని కరెంటు చార్జీలు 15% చొప్పున నాలుగు సార్లు పెంచాలని ఆనాడు కేంద్రంలో బిజెపి ఎన్డీఏ సర్కారు మద్దతు తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన పోరాటం ఆగస్టు 28 విద్యుత్ పోరాటమని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో గురువారం 12:30 గంటల సమయంలో విద్యుత్ పోరాటంలో అమరులైన వారికి వామపక్ష పార్టీలు ఘనంగా నివాళులర్పించారు.