గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, అగతవరప్పాడు గ్రామంలో 26.07.2025 న జరిగిన 26 సంవత్సరాల భార్య శారద దారుణ హత్య కేసులో నిందితుడైన భారత ఆర్మీలో పనిచేస్తున్న భర్త గివిరిబోయిన శివశంకర్ కు జిల్లా జడ్జి వై. నాగరాజా యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3,000/- జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కేసులో మృతురాలు తండ్రి తోట ఏడుకొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. భార్యను హత్య చేయడంలో నిందితుడు గివిరిబోయిన శివశంకర్ కు అతని తల్లి 53 సంవత్సరాల గివిరిబోయిన సుబ్బమ్మ కూడా సహకరించిందని తెలిపారు.