పరామర్శల పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైయస్ జగన్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో పెన్షన్ల పంపిణీ అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.