ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సుమారు 50 మంది లబ్ధిదారులు సోమవారం మధ్యాహ్నం 2:40 జిల్లా సమీకృత కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తయ్యాయని లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.