నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక డాక్టర్స్ లైన్ లో తిరుమల థియేటర్, శివాజీ చౌక్, శాస్త్రి నగర్, శ్రీనగర్ కాలనీ వద్ద మోకాళ్ళ ఎత్తులో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. వర్షంలో వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సి వచ్చింది.