తిరుపతి లో ఉన్న ఎస్ ఎస్ అపోలో హోం నర్సింగ్ కేర్ మరియు మెడికల్ సర్వీసెస్ అనే సంస్థను ఏర్పాటు చేసుకొని నర్సులను తీవ్రమైన దోపిడీ చేస్తున్న భరత పై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెలకు 30 వేల నుంచి 50 వేల వరకు జీతాలు చెల్లిస్తామని చెప్పి 24 గంటలు సేవలు చేయించుకొని 10000 కూడా జీతం ఇచ్చే పరిస్థితి వీరికి లేదని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.