పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మండలం బోయపాలెం లో ఉన్న మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కాలేజీలోని తన గదిలో ఉరేసుకొని సెక్యూరిటీ గార్డు చిగురుపాటి రాజయ్య 59 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. రాజ్య స్వగ్రామం నరసరావుపేట మండలం ఎలమంద గ్రామంగా తెలియజేశారు. గత 25 ఏళ్లుగా ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డ్ గా రాజయ్య పని చేస్తున్నారు. రాజయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా బంధువులు గ్రామస్తులు తెలిపారు.