బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో ఆయన్ను గుంటూరు జిల్లాకు నియమించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ను మర్యాదపూర్వకంగా కలిశారు.