నంద్యాల జిల్లా డోన్ పరిధిలోని అబ్బిరెడ్డిపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. నిమజ్జనం శాంతియుతంగా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహించాలన్నారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.