పెద్ద కడబూరు : మండలంలో స్పెషల్ ఆఫీసర్ ఎం నాగరాజు రావు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వసతిగృహం, తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రభావతి దేవికి ఆదేశించారు. అనంతరం ఆయా శాఖల వారీగా తయారు చేసిన నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.