వినుకొండ పట్టణంలో యువకుడు సోమవారం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిఉన్నాడు.స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఏబీఎం కాంపౌండ్ లో యువకుడు గాయాలతో పడి ఉన్నాడు.స్ధానికులు 100 కి కాల్ చేసి తెలియజేసారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది బాధితుడును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి రిఫర్ చేసారు. ఆసుపత్రికి తీసుకువెలుతుండగా మార్గమధ్యలో యువకుడు మృతి చెందాడు.... ఈ సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.