వినాయక చవితి సందర్భంగా గోకవరం మద్దాల వారి వీధిలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఛదువులమ్మ తల్లి సరస్వతి దేవికి 300 మంది విద్యార్థిని విద్యార్థులుఛే ఆదివారం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.పురోహితులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతులు ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. వచ్చిన పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.