రుద్రారంలో రోడ్డు భద్రతపై సాంస్కృతిక కళా బృందం చేత అవగాహనా రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సాంస్కృతిక కళా బృందం సభ్యులు పాటల రూపంలో అవగాహనా నిర్వహించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం ఉదయం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ కృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.