కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్ 2న అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో అధికారులతో నిర్వహించారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.