బస్సులో పోగొట్టుకున్న తన పర్సును కండక్టర్ గుర్తించి బాధ్యత మహిళలకు అందించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ ఘటన తిరువూరు ఆర్టీసీ డిపోలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కిన ఓ మహిళ తన పర్సును పోగొట్టుకుంది. దానిని గుర్తించి కండక్టర్ వెంకటేశ్వరరావు మహిళకు భద్రంగా అందించారు. దీంతో పలువురు కండక్టర్ నిజాయితీని అభినందించారు.