తెలంగాణ ఊటీగా పేరుగాంచిన అనంతగిరి అందాలను చూసేందుకు ఆదివారం సెలవు దినాలు వస్తే పర్యాటకులు భారీ సంఖ్యలో బయలుదేరుతారు. అదేవిధంగా కోటిపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపేందుకు వస్తుంటారు అందులో భాగంగా ఈరోజు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో అనంతగిరి జలపాతాల వద్ద పర్యాటకులు భారీ సంఖ్యలో చేరుకొని సందడి చేసి అనంతరం పక్కనే ఉన్న కోట్పల్లి ప్రాజెక్టు అలుగు వద్ద పారుతున్న నీటి వద్ద సరదాగా గడిపారు.