కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి.దీంతో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జి ఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ వరద బాధితులను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఆదుకున్నారు. సుమారు 400 మంది బాధితులకు ఆరు లక్షల రూపాయల విలువైన నిత్యవసర సరుకులను కిట్లను ప్లేట్లను పంపిణీ చేశారు. వరదల్లో నష్టపోయిన ప్రజలకు అండగా తాము నిలబడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు.