దాబాలలో అక్రమంగా మద్యం సిటింగ్లు నడిపిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై లింబాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల వెంకటేశ్వర దాబాలో శుక్రవారం దాడులు చేపట్టారు. దాబాలో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేయడంతో యాజమానిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించడం, సేవించడం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.