విజయవాడలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిశారు. ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే పోలేరమ్మ జాతరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రికను మంత్రి ఆనంకు ఎమ్మెల్యే అందజేశారు. ఈకార్యక్రమంలో పోలేరమ్మ దేవస్థాన ఈఓ, AMC ఛైర్మన్, పోలేరమ్మ దేవస్థాన మాజీ చైర్మన్, ఆలయ పండితులు తదితరులు పాల్గొన్నారు.