రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఆయా గ్రామాల రైతులు, సీపీఐ నాయకులతో కలిసి రైతులకు అవసరమైన యూరియా, ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ నాగమణికి వినతి పత్రం అందజేశారు.