అల్లూరి ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది గురువారం రాత్రి 8 గంటల సమయంలో జిమాడుగుల మండలం బోయతిలి పంచాయతీ గొందిపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై కరెంటు తీగలు పడి వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన వివరాలు ప్రకారం లారీపై మిల్లర్ని తీసుకు వెళ్తుండగా మిల్లర్ కి కరెంటు తీగలు తగిలి వెనుక వస్తున్న బైక్ పై పడ్డాయని దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని మృతుల వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు.