అనంతగిరి మండలంలోని అనంతగిరి, బొర్రా పంచాయితీ పరిధిలోగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డీఆర్ డిపోలను రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.. ముందుగా అనంతగిరి డిఆర్ డిపోను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించి సేల్స్మెన్ ప్రసాద్ రావుకు పలు సూచనలు చేశారు.. అక్కడ నుంచి బొర్రా గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు పాఠశాలకు వెళ్లి మెనూ పరిశీలించారు.. బొర్రా డిఆర్ డిపో తనిఖీ చేసి 34 బియ్యం బస్తాలకు గాను 14 ఉండడం, పంచదార తక్కువగా ఉండడంపై సెల్స్మెన్ కు మెమో ఇవ్వాలని ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు ఆదేశించారు.