ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మను ఆడారు. నేడు పలు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన చేయడానికి హాజరైన మంత్రి సీతక్కకు మహిళలు బతుకమ్మలతో నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళ సంఘ సభ్యులతో బతుకమ్మను ఆడారు. ప్రతీ మహిళ సంఘంలో చేరాలని, మహిళా సంఘాల ద్వారా అన్ని పథకాలు అందుతాయని, వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం జరుగుతుందని సీతక్క అన్నారు.