ప్రతి ఏడాది మాదిరిగానే హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన వేడుకలు ఈనెల 5 వ తేదీ అనగా రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హజరత్ మొహిద్దిన్ బాదుషాహ్ ఔలియా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షాహ్ సులేమాన్ ఖాద్రి తెలిపారు. గురువారం మధ్యాహ్నం నగరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హజరత్ సయ్యద్ షాహ్ సులేమాన్ ఖాద్రి మాట్లాడారు కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశ ప్రజల సుఖ సంతోషాలు కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.