ఇబ్రహీంపట్నంలోని హెచ్ పి పెట్రోల్ బంకులో నీళ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితులు శుక్రవారం మధ్యాహ్నం వివరాలు వెల్లడించారు. హెచ్పి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకోగా కారు స్టార్ట్ కాలేదని దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అన్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారని అన్నారు. సగం నీళ్లు సగం పెట్రోల్ వస్తుందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.