కూటమి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో నిరుద్యోగ ఆవేదన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రీకాకుళం క్రాంతి భవన్లో సమావేశం నిర్వహించారు. 17న విజయవాడలో జరగనున్న సదస్సును నిరుద్యోగులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు పాల్గొన్నారు.