ఉభయగోదావరి కృష్ణాజిల్లాలోని అన్ని దేవి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద ఆలయాలకు అదనపు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయానికి లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు