డి.హిరేహాల్ మండలం మడేనహళ్లి గ్రామం మీదుగా వెళ్లే కంకర ట్రిప్పర్ లు ఇష్టారాజ్యంగా తిరుగుతుండటంతో రోడ్లన్నీ పాడవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామ సమీపంలో ఉన్న కంకర క్రస్సింగ్ యూనిట్ నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రిప్పర్ ల ద్వారా కంకర బళ్ళారి ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. అయితే వారు తగిన జాగ్రత్తలు పాటించకుండా ఓవర్ లోడుతో వెళుతుండటంతో రోడ్డు మీద కంకర పడి ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదివారం ఉదయం పలువురు గ్రామస్తులు తెలిపారు.